AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ మీ టికెట్లకు సోనియా గాంధీ డబ్బులిచ్చారు’… కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న ప్రచారం

‘ మీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డబ్బులిచ్చారంటూ”.. ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు పంజాబ్ లో హల్చల్ చేశారు. పైగా మిమ్మల్ని ఆదుకునేవారెవరో మీకు తెలుసు అని కూడా వాళ్ళ భుజం తట్టారు. ఆ రాష్ట్రంలోని భటిండా రైల్వే స్టేషన్ లో జరిగిందీ వింత ఘటన.. ఆ స్టేషన్ నుంచి బీహార్ లోని ముజఫర్ పూర్ బయల్దేరుతున్న రైలు దగ్గరకు చేరుకున్నాడు అమరేందర్ రాజా వారింగ్ అనే ఈ ‘వినయ విధేయ […]

' మీ టికెట్లకు సోనియా గాంధీ డబ్బులిచ్చారు'... కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న ప్రచారం
Umakanth Rao
| Edited By: |

Updated on: May 11, 2020 | 3:20 PM

Share

‘ మీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డబ్బులిచ్చారంటూ”.. ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు పంజాబ్ లో హల్చల్ చేశారు. పైగా మిమ్మల్ని ఆదుకునేవారెవరో మీకు తెలుసు అని కూడా వాళ్ళ భుజం తట్టారు. ఆ రాష్ట్రంలోని భటిండా రైల్వే స్టేషన్ లో జరిగిందీ వింత ఘటన.. ఆ స్టేషన్ నుంచి బీహార్ లోని ముజఫర్ పూర్ బయల్దేరుతున్న రైలు దగ్గరకు చేరుకున్నాడు అమరేందర్ రాజా వారింగ్ అనే ఈ ‘వినయ విధేయ ఎమ్మెల్యే’.. ప్లాట్ ఫామ్ పై ఉన్న వలస కూలీలకు ఆయన పాంప్లెట్లు పంచి పెట్టడమే గాక.. రైలెక్కి కిటికీల నుంచి చూస్తున్నవారికి వీటిని ఇస్తూ.. మీ ప్రయాణానికి అయ్యే ఖర్చును సోనియా గాంధీయే భరిస్తున్నారని చెప్పారు. పైగా ఈ స్టేషన్ లో ఓ స్పీచ్ కూడా ఇచ్చాడు. ప్రతి వలస కార్మికుడికీ మేం సాయపడతాం అని సోనియా గతవారం ఇఛ్చిన హామీని ఆయన గుర్తు చేశాడు. ఆమె డబ్బులిచ్చారని, ఈ రాష్ట్ర సీఎం అమరేందర్ సింగ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారని వారిని కూడా పనిలో పనిగా ఆకాశానికి ఎత్తేశాడు. ఈ పాంప్లెట్ లో అన్నీ రాసి ఉన్నాయి. మీ జర్నీలో చదువుకోండి అని ఉచిత సలహా పారేశాడు. ఒక రాజకీయ పార్టీ నేత  వలస కూలీల తరలింపును వెరైటీగా  పొలిటికల్ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఇలా పాంప్లెట్లు పంచి ప్రచారం చేయడం ఇదే మొదటిసారి.

Follow Us
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు