రేపటి నుంచే చార్‌ధామ్ యాత్ర..

చార్‌ధామ్‌ యాత్ర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ప్రతి ఏటా వేలాదిమంది భక్తులతో ఎంతో సందడిగా ప్రారంభమయ్యే చార్‌ధామ్ క్షేత్రాలు.. ఈ సారి మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండానే తెరుచుకోనున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ ఆలయాలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చార్‌ధామ్ యాత్రకు భక్తులకు ప్రవేశాన్ని ప్రస్తుతానికి నిషేధించినట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం కొద్ది మంది పూజారుల సమక్షంలోనే ఈ చార్‌ధామ్‌ ఆలయాల్లో పూజలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:29 pm, Sat, 25 April 20
రేపటి నుంచే చార్‌ధామ్ యాత్ర..

చార్‌ధామ్‌ యాత్ర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ప్రతి ఏటా వేలాదిమంది భక్తులతో ఎంతో సందడిగా ప్రారంభమయ్యే చార్‌ధామ్ క్షేత్రాలు.. ఈ సారి మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండానే తెరుచుకోనున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ ఆలయాలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చార్‌ధామ్ యాత్రకు భక్తులకు ప్రవేశాన్ని ప్రస్తుతానికి నిషేధించినట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం కొద్ది మంది పూజారుల సమక్షంలోనే ఈ చార్‌ధామ్‌ ఆలయాల్లో పూజలు పునఃప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఆదివారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను, ఈ 29న కేదార్‌నాథ్‌, వచ్చే మే నెల 15వ తేదీన బద్రీనాథ్‌ ఆలయాలు తెరుచుకోబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.