ఆ 10 రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే..మరీ తెలుగు రాష్ట్రాలు ?
కోవిడ్-19 భూతం కోరల్లో చిక్కుకున్ని భారత్ వణికిపోతోంది. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదుకావడం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హాట్ స్పాట్లు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 38 జిల్లాల్లో ఉన్నట్టు గుర్తించారు.

కోవిడ్-19 భూతం కోరల్లో చిక్కుకున్ని భారత్ వణికిపోతోంది. దేశంలో పడగ విప్పుతున్న కరోనా వైరస్ ప్రతాపం చూపెడుతోంది. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదుకావడం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా, కొన్ని జిల్లాల్లోనే కరోనా ఉధృతి కొనసాగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి హాట్ స్పాట్లు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 38 జిల్లాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఆ 10 రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న 10 రాష్ట్రాల్లో 45 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కేంద్రప్రభుత్వం ప్రతి ఇంట్లో కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లోని 45 మున్సిపాలిటీల్లో ఇంటింటి సర్వే, ర్యాపిడ్ టెస్టులను కేంద్రం చేయనుంది.




