పది రాష్ట్రాల్లో 193 మంది పాకిస్థానీలు.. కేంద్రం ఏం చేసిందంటే..?
లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో ఇతర దేశాలకు చెందిన వేల మంది చిక్కుకుపోయారు. అందులో పాక్‌కు చెందిన వారు కూడా మన దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. పది రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల మంది వరకు ఇక్కడే ఉండిపోయినట్లు గుర్తించారు. వారందికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారంతా వారి స్వదేశానికి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్ వెళ్లేందుకు వారందరికీ అనుమతి నిస్తూ శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు భారత […]

లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో ఇతర దేశాలకు చెందిన వేల మంది చిక్కుకుపోయారు. అందులో పాక్‌కు చెందిన వారు కూడా మన దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. పది రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల మంది వరకు ఇక్కడే ఉండిపోయినట్లు గుర్తించారు. వారందికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారంతా వారి స్వదేశానికి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్ వెళ్లేందుకు వారందరికీ అనుమతి నిస్తూ శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ వివరాలను కూడా వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా.. మొత్తం 193 మంది పాకీస్తానీయులు.. మన దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారని తెలిపారు. వారందర్నీ ఈ నెల 5వ తేదీన పాకిస్థాన్‌కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారంతా.. మే 5వ తేదీ నాటికి వారంతా అత్తారి-వాఘా బార్డర్ చేరుకోవాలని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వీరందర్నీ.. అత్తారీ వాఘా బర్డర్ వచ్చేలా సహకరించాలని సూచించారు. దూరంగా ఉన్న వారు తక్షణమే బయలు దేరాలని.. వారు బయలు దేరేందుకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి.. వారంతా మే 5 నాటికి వాఘ బార్డర్ చేరేలా చూడాలంటూ పలు రాష్ట్రాల పోలీసు అధికారులకు విదేశాంగ శాఖ సూచించింది.