మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం కొత్త సూచనలు

మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం కొత్త సూచనలు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌‌ 5.0లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి న్యూ రూల్స్‌‌ని విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుంచి కొన్ని నిబంధనలకు లోబడి హొటళ్ల, మాల్స్‌ని నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు...

TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 05, 2020 | 8:18 AM

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌‌ 5.0లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి న్యూ రూల్స్‌‌ని విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుంచి కొన్ని నిబంధనలకు లోబడి హొటళ్ల, మాల్స్‌ని నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం అన్‌లాక్-1ను తీసుకొచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఆలయాలు, ప్రార్థనామందిరాలను తెరవచ్చు. దీనికి అప్పట్లోనే కేంద్రం కొన్ని నిబంధనలను విధించింది. తాజాగా వీటిపై మరికొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

కేంద్రం కొత్త రూల్స్:

1. దేవాలయాల్లో విగ్రహాలను తాకకూడదు 2. అన్నిచోట్లా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి 3. ఫేస్ మాస్కులు, ఫేస్ కవర్లు వినియోగం తప్పనిసరి 4. తరుచుగా సబ్బులతో చేతులు కడుక్కోవాలి. ఆల్కహాల్ ఉండే శానిటైజర్ల‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి 5. ఎవరైనా తగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు టిష్యూలు, చేతి రుమాళ్లు, గుడ్డలను అడ్డు పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని చెత్తబుట్టలో జాగ్రత్తగా పడివేయాలి 6. ఎవరికి వారు ఆరోగ్యం ఉండేలా జాగ్రత్తలు పాటించాలి 7. ఏదైనా అనారోగ్యంగా ఉండే రాష్ట్రప్రభుత్వానికి తెలియజేయాలి 8. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు 9. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వినియోగించాలి 10. హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రస్తుతమున్న సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం తగ్గించాలి 11. కూర్చుని భోజనం చేయడానికి బదులుగా టేక్‌ అవేను ప్రోత్సహించాలి 12. మాల్క్‌లో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu