అక్క‌డ… పెంపుడు పిల్లికి క‌రోనా పాజిటివ్..

క‌రోనా వైర‌స్ సృష్టిస్తున్న ప్ర‌ళ‌యం అంతాఇంతా కాదు. దీని బారిన ప‌డి మ‌నుషులు పిట్ట‌లా రాలిపోతున్నారు. ఇప్పుడు మ‌రింత భ‌యాన‌కంగా మారిన వైర‌స్‌...పెంపుడు జంతువుల‌ను కూడా,...

అక్క‌డ... పెంపుడు పిల్లికి క‌రోనా పాజిటివ్..
Follow us

|

Updated on: Mar 28, 2020 | 11:08 AM

కోవిడ్-19 లేదా క‌రోనా…ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌మంతా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతోంది. ఈ వైర‌స్ సృష్టిస్తున్న ప్ర‌ళ‌యం అంతాఇంతా కాదు. దీని బారిన ప‌డి మ‌నుషులు పిట్ట‌లా రాలిపోతున్నారు. ఇప్పుడు మ‌రింత భ‌యాన‌కంగా మారిన క‌రోనా వైర‌స్‌…పెంపుడు జంతువుల‌ను కూడా వెంటాడుతూ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో జంతుప్రేమికులు ఆందోళ‌న‌లో ప‌డుతున్నారు. పెంపుడు జంతువుల‌ను కూడా క్వారంటైన్ చేస్తున్నారు.

ప్రాణాంత‌క మ‌హమ్మారి విళ‌య‌తాండ‌వం చేస్తోంది. మనుషులనే కాదు… జంతువుల్ని కూడా పట్టి పీడుస్తోంది. తాజాగా బెల్జియంలో ఓ పెంపుడు పిల్లికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. యజమాని వల్ల పిల్లికి కూడా కరోనా వచ్చినట్లు గుర్తించారు. అటు, హంకాంగ్‌లో ఓ కుక్కకు కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే కుక్కలో తక్కువ స్థాయిలో వైరస్ (పాజిటీవ్) లక్షణాలు ఉన్నట్టు హాంకాంగ్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ అండ్ కన్జర్వేషన్ డిపార్టమెంట్(AFCD)తెలిపింది.

పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు కరోనా వైరస్ బారిన పడతాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని AFCD, ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ అంగీకరిస్తున్నాయి. కుక్కలు వైరస్ పాజిటివ్‌ అని పరీక్షించగలిగినప్పటికీ, దాని అర్థం వాటికి వైరస్ సోకినట్లు కాదంటున్నాయి. అయితే, కరోనావైరస్ బారిన పడిన పెంపుడు జంతువులను 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కుక్క తర్వాత పెంపుడు పిల్లిలో కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో పెంపుడు జంతువులు ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.