బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. ఒక్క రోజే 21 వేలకు పైగా..
కరోనా మహమ్మారి బ్రెజిల్‌లో విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను కంటికి కనిపించని ఈ వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తోంది. వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
కరోనా మహమ్మారి బ్రెజిల్‌లో విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను కంటికి కనిపించని ఈ వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తోంది. వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలతో పాటు.. అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా బ్రెజిల్‌లో ఒక్కరోజే 21వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.5 లక్షలు దాటింది. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 892 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 42వేలు దాటింది. ఇదిలావుంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షలు దాటింది.