AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ కీలక నేతకు కరోనా..! అనుచరుల్లో ఆందోళన

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వేల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించటంతో ఆస్పత్రిలో చేరారు.

బీజేపీ కీలక నేతకు కరోనా..! అనుచరుల్లో ఆందోళన
Jyothi Gadda
|

Updated on: May 28, 2020 | 6:02 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వేల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించటంతో ఆస్పత్రిలో చేరారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కోవిడ్-19 వైరస్ అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో సంబిత్ పాత్రా గురువారం రోజున గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేరినట్టు తెలిసింది.. ఆయనకు కరోనా లక్షణాలు బయటపడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సంబిత్‌తో సన్నిహితంగా ఉన్నవారు కూడా ముందస్తుగానే వైరస్ టెస్ట్‌లు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.

తరుచూ మీడియాలో కనిపించే బీజేపీ నేతల్లో సంబిత్ పాత్రా ఒకరు. సోషల్ మీడియాలోనూ ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. గురువారం సైతం ఆయన పలు ట్వీట్లు చేశారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌ గాంధీని అవమానిస్తూ ట్వీట్లు చేశారన్న ఆరోపణలపై సంబిత్‌ పాత్రాపై పరువునష్టం దావా కేసు నమోదైంది. మహారాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బ్రిజ్‌కిశోర్‌ దత్తా కళ్యాణ్‌లోని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?