బీజేపీ రాజ్యసభ సభ్యుడికి కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుమేర్ సింగ్ సొలంకికి కూడా..
కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుమేర్ సింగ్ సొలంకికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజుల నుంచి అస్వస్థతకు గురవ్వడంతో పాటు.. జ్వరం రావడంతో ఆయనకు కరోనా టెస్టులు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్‌లో కరోనా సోకుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జూన్ నెలలో జ్యోతిరాదిత్య సింథియాకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మతో పాటుగా.. ముగ్గురు మంత్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడా కరోనా మహమ్మారి సోకింది.
Read More :
దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు