AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్ధిష్ట లక్ష్యాలతో ముందుకెళ్తాం అంటున్న జో బిడెన్… 100 రోజుల్లో ఆ మూడు పనులపైనే ఫుల్ ఫోకస్…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బిడెన్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాక చేయబోయే పనులపై స్పందించారు. నిర్ధిష్ట లక్ష్యం, ప్రణాళికలతో ముందుకెళ్తామని తాజాగా ప్రకటించారు.

నిర్ధిష్ట లక్ష్యాలతో ముందుకెళ్తాం అంటున్న జో బిడెన్... 100 రోజుల్లో ఆ మూడు పనులపైనే ఫుల్ ఫోకస్...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 09, 2020 | 2:55 PM

Share

Biden vows 100 million Covid-19 vaccinations in first 100 days  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బిడెన్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాక చేయబోయే పనులపై స్పందించారు. నిర్ధిష్ట లక్ష్యం, ప్రణాళికలతో ముందుకెళ్తామని తాజాగా ప్రకటించారు.

100 రోజులు… మూడు పనులు…

అమెరికాలో ఇప్పటి వరకు 1,51,71,676 మంది కరోనా బారినపడ్డారు. 2,86,307 మృత్యువాతపడ్డారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి వంద రోజుల్లో చేపట్టనున్న పనులను ప్రకటించారు. 100 రోజుల్లో మూడు ముఖ్యమైన పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని అన్నారు.

మొదటిది అందరు కచ్చితంగా మాస్కు ధరించేలా చూస్తానని అన్నారు. రెండోది అవసరమైన వారందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని ప్రకటించారు. దాదాపు 10 కోట్ల మందికి 100 రోజుల్లోపు టీకాలు వేయిస్తామని తెలిపారు. అదే విధంగా అమెరికా భవిష్యత్ తరమైన విద్యార్థులు తిరిగి పాఠశాలలకు వెళ్లేలా చూస్తామని అన్నారు. వారికి అనుకూలమైన వాతావరణ కల్పనకు కృషి చేస్తామని ప్రకటించారు.