ధాన్యం కొనుగోలు కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
రైతుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 6,500 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచి వీటి ద్వారా ధాన్యాన్ని కొనేందుకు..
రైతుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 6,500 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచి వీటి ద్వారా ధాన్యాన్ని కొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కరోనా వైరస్ తీవ్రతను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సీఎం కేసీఆరే గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల వివరాలను పౌరసరఫరాల శాఖ సేకరించింది. నిజామాబాద్‌లో అత్యధికంగా 540 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక జగిత్యాలలో 500, నల్గొండలో 415, సిద్ధిపేటలో 330, కరీంనగర్‌లో 320, కామారెడ్డిలో 310, పెద్ద భూపాలపల్లిలో 320, మంచిర్యాలలో 250, వనపర్తిలో 240, కొత్తగూడెంలో 220 కేంద్రాలని నిర్ణయించారు. ఇక మిగిలిన జిల్లాల్లో 100 నుంచి 150 వరకూ కేంద్రాలను తెరవనున్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లకు మరో 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రూ.20 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గతంలో అనుమతిచ్చింది. దిగుబడి పెరగనున్న దృష్ట్యా మరిన్ని నిధులు అవసరమని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం రూ.45 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటామని హామీ ఇచ్చింది.
ఇక ప్రతీ గింజా కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 1.23 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..
మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్‌లో కష్టాలు
ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు
బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం
ఈరోజే ‘మోదీ దీపావళి’.. సిద్ధమవుతోన్న భారతీయులు
కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే
మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు