ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో ఉన్న అన్ని ప్రార్ధనా మందిరాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 3.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా వాటికీ మాత్రం అనుమతివ్వలేదు. అయితే మత సంస్థల ఒత్తిడి కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ముస్లింలు మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ.. అన్ని మసీదుల్లోనూ […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

May 09, 2020 | 4:35 PM

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో ఉన్న అన్ని ప్రార్ధనా మందిరాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 3.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా వాటికీ మాత్రం అనుమతివ్వలేదు. అయితే మత సంస్థల ఒత్తిడి కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎట్టకేలకు ముస్లింలు మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ.. అన్ని మసీదుల్లోనూ హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచాలని.. ఎవరి మ్యాట్ వారే తెచ్చుకోవాలని సూచించింది. అయితే మసీదు పరిసరాల్లో మాత్రం ఇఫ్తార్ విందులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కాగా, బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 13,134 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా కారణంగా 206 మంది ప్రాణాలు విడిచారు.

Read More:

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

గుజరాత్‌కు ‘కరోనా’ అప్పుడే వచ్చిందట… కానీ అది వైరస్ కాదట..

అక్కడ బార్లకు, రెస్టారెంట్లకు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu