గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

భోపాల్ గ్యాస్ దుర్ఘటనను తలపిస్తూ రెండు రోజుల క్రితం విశాఖలో సంభవించిన గ్యాస్ లీకేజ్ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దీనితో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు లేని పరిశ్రమలు ఎన్ని ఉన్నాయన్న దానిపై ఓ […]

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..
Follow us

|

Updated on: May 09, 2020 | 1:18 PM

భోపాల్ గ్యాస్ దుర్ఘటనను తలపిస్తూ రెండు రోజుల క్రితం విశాఖలో సంభవించిన గ్యాస్ లీకేజ్ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దీనితో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు లేని పరిశ్రమలు ఎన్ని ఉన్నాయన్న దానిపై ఓ రిపోర్టు సిద్ధం చేయగా.. దాదాపు 86 పరిశ్రమలు ఉన్నట్లు తేలింది.  వీటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండవచ్చునని ప్రభుత్వం ప్రాధమిక అంచనాకు వచ్చింది. దీనితో వెంటనే ఆ 86 పరిశ్రమలపై చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఈ పరిశ్రమలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు వెళ్లి తనిఖీ చేసి.. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించారు. లేని పక్షంలో మొత్తం అన్నింటిని సీజ్ చేయనున్నారు. కాగా, పరిశ్రమల భద్రతా ప్రమాణాలను పరిశీలించి రెండు రోజుల్లో పూర్తి నివేదికను నివేదికను పంపాలని పరిశ్రమల శాఖ… ఆయా జిల్లాల్లో అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.

Read More:

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!