రష్యాలో కరోనా ఉధృతి… ఆసుపత్రి కిటికీల నుంచి కింద పడి ఇద్దరు డాక్టర్ల దుర్మరణం

రష్యాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే 10,699 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 187,859 కి చేరింది. గత 24 గంటల్లో ఈ దేశంలో 98 మంది మరణించగా ఈ సంఖ్య మొత్తం 1723 కి పెరిగింది. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇలా ఉండగా.. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది క్రమంగా డిప్రెషన్ కి గురవుతున్నారు. పని వత్తిడి […]

రష్యాలో కరోనా ఉధృతి... ఆసుపత్రి కిటికీల నుంచి కింద పడి ఇద్దరు డాక్టర్ల దుర్మరణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 09, 2020 | 3:25 PM

రష్యాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే 10,699 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 187,859 కి చేరింది. గత 24 గంటల్లో ఈ దేశంలో 98 మంది మరణించగా ఈ సంఖ్య మొత్తం 1723 కి పెరిగింది. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇలా ఉండగా.. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది క్రమంగా డిప్రెషన్ కి గురవుతున్నారు. పని వత్తిడి భరించలేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం ముగ్గురు డాక్టర్లు ఆసుపత్రి కిటికీలనుంచి కింద పడిపోయారు.  ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరు ప్రమాదవశాత్తూ కింద పడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న విషయం నిర్ధారణ కాలేదు. తమ ‘వర్కింగ్ కండిషన్స్’ చాలా దారుణంగా ఉన్నాయని, తమకు కనీసం మాస్కులు, సూట్లు లేవని డాక్టర్లు వాపోతున్నారు. తమ డిమాండ్ల గురించి పట్టు పడితే డిస్మిస్ చేస్తామనో , ప్రాసిక్యూట్ చేస్తామనో  ప్రభుత్వం వీరిని బెదిస్తోంది. కరోనా రోగుల చికిత్సలో ఉన్న  వైద్య సిబ్బందికి ఈ వ్యాధి సోకినప్పటికీ..డ్యూటీ వేళలతో నిమిత్తం లేకుండా వారు చికిత్స చేయవల్సిందేనని ఆదేశిస్తోంది. దీంతో వైద్య సిబ్బంది దినమొక గండంగా గడుపుతున్నారు.