AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. గాంధీలో కరోనా బాధితురాలికి జన్మించిన శిశువుకు నెగటివ్

కరోనా సోకిన ఓ నిండు గర్భిణి శుక్రవారం పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే..గాంధీ ఆస్ప‌త్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న నిండు గ‌ర్భిణీ శుక్ర‌వారం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల‌తో ఆమెకు సిజేరియన్ చేసిన గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త‌ల్లికి క‌రోనా పాజిటివ్ ఉండ‌టంతో చిన్నారికి కరోనా టెస్టు చేశారు. కాగా, రిపోర్ట్స్ నెగెటివ్‌గా […]

గుడ్ న్యూస్.. గాంధీలో కరోనా బాధితురాలికి జన్మించిన శిశువుకు నెగటివ్
Jyothi Gadda
|

Updated on: May 09, 2020 | 3:12 PM

Share

కరోనా సోకిన ఓ నిండు గర్భిణి శుక్రవారం పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే..గాంధీ ఆస్ప‌త్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న నిండు గ‌ర్భిణీ శుక్ర‌వారం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల‌తో ఆమెకు సిజేరియన్ చేసిన గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త‌ల్లికి క‌రోనా పాజిటివ్ ఉండ‌టంతో చిన్నారికి కరోనా టెస్టు చేశారు. కాగా, రిపోర్ట్స్ నెగెటివ్‌గా రావడంతో డాక్ట‌ర్లు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంద‌ర్బంగా గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు వైద్యులు ప‌లు సూచ‌న‌లు చేశారు.

కరోనా వైరస్ సోకిన తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు తదితర రక్షణ కవచాలు ధరించాలి. చేతులను, స్తన్యాలను ఎప్ప‌టిక‌ప్పుడు పరిశుభ్రంగా చేసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచ‌న‌ల‌ను వివ‌రించారు. పాలు పట్టిన అనంతరం ఆ తల్లి బిడ్డను టచ్ చేసిన ఆయా శరీర భాగాలను పరిశుభ్రం చేయాలని తెలిపారు. అయితే,  తల్లికి కరోనా సోకినప్పటికీ.. సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువని చెప్పారు. తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకుతుందని ఆధారాలు లేవని అప్పట్లో ఎయిమ్స్ వైద్యులు చెప్పార‌ని అన్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..