పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును ఈ ఆటోవాలా ఏంచేశాడో చూడండి..!
ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలంటే ఆస్తులు, అంతస్తులు కాదని.. సాయం చేసే గుణం ఉంటే చాలని నిరూపించాడు ఓ ఆటోవాలా. ఏకంగా తన పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును కాస్త వలస కూలీల కడుపు నింపాడు. ఇందుకు కాబోయే భార్య కూడా సరినంటూ తోడైంది. మహారాష్ట్రలోని పుణెకి చెందిన అక్షయ్ కొతవాలే ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మే 25న అక్షయ్ కి వివాహం జరిపించాలని పెద్దల నిర్ణయించారు. కానీ ఈలోపే కరోనావైరస్ పుణ్యమాని.. కేంద్రం లాక్ […]

ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలంటే ఆస్తులు, అంతస్తులు కాదని.. సాయం చేసే గుణం ఉంటే చాలని నిరూపించాడు ఓ ఆటోవాలా. ఏకంగా తన పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును కాస్త వలస కూలీల కడుపు నింపాడు. ఇందుకు కాబోయే భార్య కూడా సరినంటూ తోడైంది.
మహారాష్ట్రలోని పుణెకి చెందిన అక్షయ్ కొతవాలే ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మే 25న అక్షయ్ కి వివాహం జరిపించాలని పెద్దల నిర్ణయించారు. కానీ ఈలోపే కరోనావైరస్ పుణ్యమాని.. కేంద్రం లాక్ డౌన్ విధించింది. దీంతో చేసేదిలేక పెళ్లిని కాస్త వాయిదా వేసుకున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా వేలాదిమంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయి తిండి తిప్పలు లేక సొంతూళ్లకి వెళ్లలేక రోడ్డునపడ్డారు. వీధుల వెంట నిలబడి అన్నం పెట్టే అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు అక్షయ్ ని కలచివేశాయి.
వలసకూలీల కోసం కడుపు నిండా అన్నం పెట్టాలని భావించాడు. స్నేహితులను సంప్రదించాడు. పెళ్లి కోసం దాచుకున్న సొమ్ముని వినియోగించుకోవాలనుకున్నాడు. కాబోయే భార్యను ఒప్పించి.. లాక్ డౌన్ పూర్తైయ్యే వరకూ నిత్యం భోజనం పెట్టాలని నిర్ణయించాడు. వారి సాయంతో చపాతీలు, కూరలు అందించడం మొదలు పెట్టాడు. తన డబ్బులు సరిపోకపోవడంతో స్నేహితుల సహాయంతో సాంబరన్నం చేసి ఒకపూట వలసకూలీల ఆకలిని తీర్చాడు.
అంతేకాదు వైద్యం కోసం వెళ్లే వృద్ధులు, గర్భిణులనూ ఉచితంగా తన ఆటోలో ఆస్పత్రులుకు చేరుస్తున్నాడు. స్పేహితులతో కలిసి మాస్క్, శానిటైజర్లు పంచిపెడుతూ.. లాక్ డౌన్ జాగ్రత్తలు పాటించాలంటూ మైక్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాడు అక్షయ్.
లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకునే కన్న పేదవాడి ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందంటున్నాడు అక్షయ్. తన ఆలోచనకి కాబోయే భార్య, స్నేహితుల సాయంతోనే ఇది సాధ్యమైందన్నాడు అక్షయ్.




