ఇక ఏసీ బస్సులకు అనుమతి..

లాక్‌డౌన్‌ 5.0 అమలులోకి రావటంతో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించింది ఆర్టీసీ. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. ఇది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏసీ బస్సు సర్వీసులకు విరామం ఇచ్చిన ఆర్టీసీ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది. విజయవాడ నుంచి విశాఖకు ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించింది. డిమాండ్‌ను దృష్టిలో […]

ఇక ఏసీ బస్సులకు అనుమతి..
Follow us

|

Updated on: Jun 02, 2020 | 11:22 AM

లాక్‌డౌన్‌ 5.0 అమలులోకి రావటంతో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించింది ఆర్టీసీ. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. ఇది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు ఏసీ బస్సు సర్వీసులకు విరామం ఇచ్చిన ఆర్టీసీ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది. విజయవాడ నుంచి విశాఖకు ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించింది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఏసీ బస్సు సర్సీసులను విశాఖ సహా తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు నడపాలని నిర్ణయించింది.

మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. వీటిలో పల్లె వెలుగు బస్సులకు ఆదరణ లేకపోయినా దూర ప్రాంత బస్సులకు మాత్రం డిమాండ్‌ ఎక్కవగా ఉంది. వీటిలో డిమాండ్‌ ఉన్న విశాఖ, రాజమండ్రి రూట్లకు బస్సులను పెంచుతున్నారు.