బ్రేకింగ్: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రాత్రి 7 గంటలకు అమిత్‌షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్...

బ్రేకింగ్: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రాత్రి 7 గంటలకు అమిత్‌షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు జగన్. రేపు కూడా అక్కడే ఉండి తిరిగి వచ్చేలా టూర్‌ని షెడ్యూల్ చేసుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఆయన పర్యటన వాయిదా పడింది. కోవిడ్ నివారణ చర్యల్లో అమిత్ షా బిజీగా ఉండటం వల్ల.. జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సెల్ అయినట్టు సమాచారం.

ఈ రోజు మీటింగ్‌లో కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా జగన్.. కేంద్ర మంత్రి అమిత్‌ షాని కోరనున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి సవివరంగా రెండు లేఖలను రాశారు ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే అంశంతో పాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి కూడా జగన్ అమిత్‌షాతో చర్చించాల్సి ఉంది. అయితే అనుకోకుండా చివరి నిమిషంలో సీఎం టూర్ వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలిన యువకుడు

మళ్లీ ఎబోలా కలకలం.. నలుగురు మృతి

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం