షాకింగ్: బాలీవుడ్‌ నటి సహా ఫ్యామిలీ మొత్తానికి కరోనా వైరస్

ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటికి కరోనా వైరస్ సోకింది. కేవలం ఆమెకే కాకుండా ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ న్యూస్ వినగానే అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కూడా కరోనా ఏదో ఒక రూపంలో..

షాకింగ్: బాలీవుడ్‌ నటి సహా ఫ్యామిలీ మొత్తానికి కరోనా వైరస్

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అందులోనూ లాక్‌డౌన్‌ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. ఇక మరణాల సంఖ్య 5 వేలు దాటేసింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటికి కరోనా వైరస్ సోకింది. కేవలం ఆమెకే కాకుండా ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ న్యూస్ వినగానే  అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కూడా కరోనా ఏదో ఒక రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది.

బాలీవుడ్ నటి మోహెనా కుమారి సింగ్ ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్‌, అత్త అమృతరావత్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా తామంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. త్వరలోనే కోలుకుంటామని చెప్పారు. మోహెనా కుమారి ‘యే రిష్టా క్యా కహ్లేతా హై’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వా త పలు సినిమాల్లో నటించారు. గతేడాది అక్టోబర్‌లో ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి కుమారుడు సుయేష్ రావత్‌ను పెళ్లి చేసుకున్నారు. ముందుగా మోహెనా కుమారి అత్త అమృతరావత్‌కు సోకడంతోనే తామంతా వ్యాధికి గురయ్యామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలిన యువకుడు

మళ్లీ ఎబోలా కలకలం.. నలుగురు మృతి

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం