‘నైరుతి’ జోరు.. కేరళలో భారీ వర్షాలు.. తెలంగాణలో రెయిన్ అలర్ట్..

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మరోవైపు ఊహించినట్లే నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం కేరళ అంతటా వర్షాలు కురుస్తున్నాయి.

'నైరుతి' జోరు.. కేరళలో భారీ వర్షాలు.. తెలంగాణలో రెయిన్ అలర్ట్..

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మరోవైపు ఊహించినట్లే నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం కేరళ అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ కూడా ఉంది. అక్కడ అతి భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈసారి నైరుతి రుతుపవనాలు 4 నెలలపాటూ చురుగ్గా ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు.

కాగా.. ఈ ఏడాది ఉత్తర భారత్‌లో ఈసారి సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడతాయంటున్నారు. దక్షిణ భారత్‌లో మాత్రం సాధారణ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తూర్పు, ఈశాన్య భారత్‌లో మాత్రం తక్కువ వానలు పడతాయని చెప్పారు. మొత్తంగా సెప్టెంబర్ నాటికి 75 శాతం వానలు కురుస్తాయంటున్నారు.

మరోవైపు.. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుఫాను ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజారాత్ దగ్గర జూన్ 3 సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఆ రెండు రాష్ట్రాలతోపాటూ… గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముంబైలో కొద్దిపాటి వానలు పడతాయన్నారు.

దీంతో గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. NDRF బృందాలను రంగంలోకి దింపింది. ఆరు జిల్లాల్లోని తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 23 ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపింది. ఏపీలో మాత్రం ఎండలు తగ్గలేదు. వానలు కురవట్లేదు. ఐతే… రాబోయే మూడు రోజులపాటు చిన్నపాటి వర్షాలు పడతాయని విజయవాడ వాతావరణ కేంద్రం తెలిపింది.

[svt-event date=”02/06/2020,10:55AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..