ప్రయాణీకులకు రైల్వే శాఖ విజ్ఞప్తి…

జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, రోగనిరోధక శక్తి లోపం ఉన్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వృద్దులు అత్యవసరం అయితేనే రైళ్లలో ప్రయాణించాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. కాగా, వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రతీ రోజూ రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లు నడుపుతోంది. ఈ తరుణంలో కొన్ని […]

  • Ravi Kiran
  • Publish Date - 12:51 pm, Fri, 29 May 20
ప్రయాణీకులకు రైల్వే శాఖ విజ్ఞప్తి...

జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, రోగనిరోధక శక్తి లోపం ఉన్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వృద్దులు అత్యవసరం అయితేనే రైళ్లలో ప్రయాణించాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది.

కాగా, వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రతీ రోజూ రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లు నడుపుతోంది. ఈ తరుణంలో కొన్ని అనుకోని దురదృష్టకర ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అందుకే కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందుతున్న వ్యక్తులు ప్రయాణాలు చేయవద్దు అని కోరింది.

Read This: ఎవరినైనా మిస్ చేస్తే క్షమించండిః సోనూసూద్