హర్యానా కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దులు మూసివేత.. భారీగా ట్రాఫిక్ జామ్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో

హర్యానా కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దులు మూసివేత.. భారీగా ట్రాఫిక్ జామ్..
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 12:44 PM

Delhi Haryana Border Closed: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమైంది. అయితే.. ఢిల్లీ – గుర్గావ్ హైవేపై శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్లే అన్ని దారులను మూసేయాలని హర్యానా నిర్ణయించడంతోనే ఈ సమస్య తలెత్తింది.

కాగా.. లాక్ డౌన్ సడలింపులతో.. ఢిల్లీ నుంచి హర్యానా, హర్యానా నుంచి ఢిల్లీకి ప్రజల రాకపోకలు పెరగడంతోనే కరోనా కేసులు పెరిగాయని హర్యానా హోంమంత్రి పేర్కొన్నారు. అయితే హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డా సరే, భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు మాత్రం ప్రజల ఐడీ కార్డులను, పాసులను పరిశీలించిన తర్వాతే అనుమతినిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌పై కొత్త మార్గదర్శకాలేవీ రాలేదని, నాలుగో దశ మార్గదర్శకాలను మాత్రమే తాము పాటిస్తున్నామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

[svt-event date=”29/05/2020,12:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”29/05/2020,12:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..