అధికారులు, ఉద్యోగులు రాష్ట్రం విడిచి వెళ్లొద్దు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్ జోన్ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ కేటాయించింది. ఏపీ సచివాలయంలో కూడా పలువురు ఉద్యోగులకు...

అధికారులు, ఉద్యోగులు రాష్ట్రం విడిచి వెళ్లొద్దు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 5:52 PM

ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్ జోన్ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ కేటాయించింది. ఏపీ సచివాలయంలో కూడా పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సైతం ఇంటి నుంచే పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

కాగా ప్రస్తుతం ఏపీలో 200కు పైనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5636కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 141 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించకపోగా.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. అలాగే 2465 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

నోకియా ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు..

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..