జగన్ సర్కార్ సంచలనం.. రైతుల కోసం ‘ఆంధ్రాగ్రీన్స్.కామ్’..
ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సంక్షేమ పధకాలను అమలు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా రైతు భరోసా డబ్బును లబ్దిదారులైన రైతులకు అందించిన జగన్.. ఇప్పుడు కొత్తగా వారి కోసం ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ‘ఆంధ్రాగ్రీన్స్.కామ్‘ పేరిట ఉన్న ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ వెబ్‌సైట్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. […]
ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సంక్షేమ పధకాలను అమలు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా రైతు భరోసా డబ్బును లబ్దిదారులైన రైతులకు అందించిన జగన్.. ఇప్పుడు కొత్తగా వారి కోసం ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు.
‘ఆంధ్రాగ్రీన్స్.కామ్‘ పేరిట ఉన్న ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ వెబ్‌సైట్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. కర్ణాటకలో ‘కాల్గుడి’.. తెలంగాణలో ‘టీప్రెస్’ ఈ సంస్థ మార్కెటింగ్ చేస్తోందన్నారు. రైతులు పండించే పండ్లు, కూరగాయలను ఈ సంస్థ నేరుగా కొనుగోలు చేసి ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తుందన్నారు. అంతేకాకుండా నేరుగా కొనుగోలుదారుడి ఇంటికే వాటిని చేరుస్తుందన్నారు. దీని వల్ల వినియోగదారుడికి, రైతులకు ప్రయోజనం ఉంటుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. కాగా, లాక్ డౌన్ కారణంగా సుమారు 50 రోజులుగా నిలిచిపోయిన ఆర్ధిక కార్యకలాపాలు అన్నీ కూడా రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమవుతున్నాయి.
Read More:
షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!
10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..