AP Corona Cases: ఆంధ్రాలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. కొత్తగా నమోదైన కేసులు, మరణాల వివరాలు
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కొత్తగా రాష్ట్రంలో 31,657 నమూనాలను టెస్ట్ చేయగా..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కొత్తగా రాష్ట్రంలో 31,657 నమూనాలను టెస్ట్ చేయగా.. 1,941 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 424 మంది వైరస్ బారినపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 25 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం మీడియా బులిటెన్ విడుదల చేసింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 9,10,943కి చేరింది.
24 గంటల వ్యవధిలో 835 మంది వ్యాధి బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,809 యాక్టీవ్ కేసులున్నాయి. కొవిడ్ కారణంగా కొత్తగా ఆరుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. తాజా మరణాలతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది.
#COVIDUpdates: 06/04/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,08,048 పాజిటివ్ కేసు లకు గాను *8,88,988 మంది డిశ్చార్జ్ కాగా *7,251 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,809#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Re1glN1ZCS
— ArogyaAndhra (@ArogyaAndhra) April 6, 2021
కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
దేశంలో కూడా ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి…
భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. కొత్తగా 96,982 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అలాగే వైరస్ కారణంగా 446 మంది మృతి చెందారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,26,86,049 కరోనా కేసులు నమోదు కాగా.. 1,65,547 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 50,143 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,17,32,279కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,88,223 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు… హైదరాబాద్‌లో బీర్లకు ఫుల్ డిమాండ్.. రికార్డ్ లెవల్ సేల్స్