Covid-19: కోవిడ్ వ్యాక్సినేషన్ అలర్ట్…కేంద్ర ప్రభుత్వోగులకు కీలక ఆదేశాలు

దేశంలో కోవిడ్ విజ‌‌‌ృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వోగులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Covid-19: కోవిడ్ వ్యాక్సినేషన్ అలర్ట్...కేంద్ర ప్రభుత్వోగులకు కీలక ఆదేశాలు
Covid19 Vaccine
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 06, 2021 | 5:24 PM

దేశంలో కోవిడ్ విజ‌‌‌ృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వోగులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు 45 ఏళ్లకు పైబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కోవిడ్19 వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఉద్యోగులు తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కోవిడ్ నివారణ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.