AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,169 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,169 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 22, 2021 | 5:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో  53 మంది బాధితులు కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,416కి చేరింది. కొత్తగా 8,376 మంది బాధితులు కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 17,91,056కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,880 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,12,80,302  శాంపిల్స్ ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 743, పశ్చిమ గోదావరిలో 659, చిత్తూరులో 472 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 7, ప్రకాశం, తూర్పుగోదావరి  జిల్లాలో ఆరుగురు చొప్పున మరణించారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

దేశంలో కరోనా వివరాలు ఇలా…

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 42,640 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 91 రోజుల్లో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం.  కాగా,మహమ్మారి ధాటికి మరో 1,167 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 81,839 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,99,77,861
  • మొత్తం మరణాలు: 3,89,302
  • కోలుకున్నవారు: 2,89,26,038
  • యాక్టివ్ కేసులు: 6,62,521

సోమవారం ఒక్కరోజే 16,64,360 శాంపిల్స్ పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 39,40,72,142కు చేరింది.

Also Read: యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..

అది నిజమైతే మీకే ముందు స్వీట్స్ ఇస్తా .. గర్భవతి వార్తలపై స్పందించిన పూనమ్ పాండే

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!