కరోనా అప్‌డేట్స్: ఏపీలో భారీగా నమోదైన కేసులు.. ఏకంగా

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 465 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కు చేరింది. 

కరోనా అప్‌డేట్స్: ఏపీలో భారీగా నమోదైన కేసులు.. ఏకంగా
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2020 | 3:11 PM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 465 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కు చేరింది.  ఇందులో రాష్ట్రంలో కొత్తగా 376 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో నాలుగు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 96కి చేరింది. అలాగే 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 17,609 పరీక్షలు నిర్వహించగా.. అందులో 376 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6230కు చేరింది.  వారిలో తాజాగా 82 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 3,065కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 3,069 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 19 మందికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 308కు చేరింది. అందులో 261 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1423కు చేరింది. వీరిలో 51 మంది తాజాగా డిశ్చార్జి అవ్వగా.. 630 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల కరోనా పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. మరో రికార్డును ఖాతాలో వేసుకుంది.

Read This Story Also: ఆ లోపు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం.. డబ్ల్యూహెచ్‌వో ఆశాభావం

Latest Articles
ఆ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు పక్కా..!
ఆ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు పక్కా..!
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?