కరోనా ఊరట: ఆ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు..!
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో రోజూ 10వేలకు పైనే నవెూదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,586 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,80,532 చేరింది...కాగా, ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా కాస్తా శాంతించినట్లుగా కనిపిస్తోంది. కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదవకపోవడంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో రోజూ 10వేలకు పైనే నవెూదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,586 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,80,532 చేరింది. అందులో 1,63,248 యాక్టివ్ కేసులు ఉండగా… 2,04,711 మంది కరోనా నుండి కోలుకున్నారు. అటు తాజాగా 336 మరణాలు సంభవించగా.. మొత్తం మరణాల సంఖ్య 12,573కు చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా ఉధ్దృతి ఆందోళన కర స్థాయిలో ఉంది. ఇదిలా ఉంటే, కరోనా కేసుల విషయంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కాస్త ఊరట లభించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదవకపోవడంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. మొత్తం 556 శాంపిల్స్ ను గురువారం సేకరించారు. వాటిల్లో 466 శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఆ 466 శాంపిల్స్ లో ఒక్కరికి కూడా కరోనా రాలేదని స్పష్టమయింది.. ఇంకా 89 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. ఒక శాంపిల్ రిజెక్ట్ అయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 595 కరోనా కేసులు నమోదయ్యాయి. 376 మంది రోగులు.. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 200 మంది కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.




