మరింత క్షీణించిన మంత్రి ఆరోగ్యం

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. నాలుగు రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జైన్ ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని వైద్యులు వెల్లండించారు. దీంతో వెంటనే ఆక్సిజన్ సపోర్ట్ అందించినట్లుగా తెలిపారు. ఇక, సోమవారం (జూన్ 14) రాత్రి ఆయనకు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో […]

మరింత క్షీణించిన మంత్రి ఆరోగ్యం

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. నాలుగు రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జైన్ ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని వైద్యులు వెల్లండించారు. దీంతో వెంటనే ఆక్సిజన్ సపోర్ట్ అందించినట్లుగా తెలిపారు.

ఇక, సోమవారం (జూన్ 14) రాత్రి ఆయనకు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహించగా, కరోనా నెగిటివ్‌ అని వచ్చింది. అయితే లక్షణాలు మాత్రం తగ్గకపోవడంతో బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయనను ఐసోలేషన్ లో ఉంచిన విషయం తెలిసిందే..