ఏపీలో మరోసారి కరోనా వైరస్ కలకలం.. కొత్తగా 88 మందికి పాజిటివ్
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు కరోనా పరీక్షలు పెంచుతోంది.
Andhra Pradesh corona : దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు కరోనా పరీక్షలు పెంచుతోంది. అయినప్పటికీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,680 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 88 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,298కి చేరింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,167 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24గంటల వ్యవధిలో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 72 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,511కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 620 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,37,28,728 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.