US Oxygen: డెల్టా వేరియంట్ విజృంభణతో విలవిల.. పేషెంట్లతో నిండుతున్న ఆసుపత్రులు.. ఆక్సిజన్ అందక అమెరికన్ల అవస్థలు
ప్రపంచానికే పెద్దాన్న.. ఏక్కడ ఏం జరిగినా.. నేనున్నానని ముందుకు వచ్చే దేశం.. అగ్రరాజ్యం ఆక్సిజన్ కొరత అల్లాడిపోతోంది. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన అమెరికా ప్రాణ వాయువు అందక తల్లడిల్లుతోంది.
Oxygen Shortage in America: ప్రపంచానికే పెద్దాన్న.. ఏక్కడ ఏం జరిగినా.. నేనున్నానని ముందుకు వచ్చే దేశం.. అగ్రరాజ్యం ఆక్సిజన్ కొరత అల్లాడిపోతోంది. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన అమెరికా ప్రాణ వాయువు అందక తల్లడిల్లుతోంది. అవును మీరు విన్నది నిజమే సేమ్ టూ సేమ్ సెకండ్ వేవ్‌లో ఎలాంటి కష్టాలు మనం అనుభవించామో ఇప్పుడు యూఎస్ కూడా ఆక్సిజన్ షార్టేజ్‌తో పాత కష్టాలను కొత్తగా అనుభవిస్తోంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే.. విడతల వారీగా విరుచుకుపడుతూ.. కోట్లాది మందిని ఉపిరాడకుండా చేస్తోంది. తాజాగా అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ మామూలుగా లేదు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించినా.. పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. వ్యాక్సిన్ వేయించుకున్నా.. లేకున్నా.. వేరియంట్ మాత్రం విస్తరిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పేషెంట్లు ఆస్పత్రుల పాలవుతుండడంతో.. ఆక్సిజన్ కొరత మొదలైంది.
ముఖ్యంగా ఫ్లొరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రుల్లో కరోనా బారినపడి చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఐసీయూలో బెడ్స్ అన్ని నిండిపోతున్నాయి. దీంతో వారికి ఆక్సిజన్ తప్పనిసరి అవుతోంది. అయితే, అందరికీ సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేక తీవ్ర కొరత ఏర్పడుతోంది. కొన్ని చోట్ల రిజర్వ్ చేసిన ఆక్సిజన్ వాడాల్సిన ప్రమాదం ముంచుకొస్తోంది. ఆస్పత్రుల్లో పేషెంట్లు పెరగడంతో.. ఎప్పుడూ నిండుగా ఉండే ఆక్సిజన్ ట్యాంకులు ఇప్పుడు నిండుకుంటున్నాయి. 50శాతానికి కూడా పడిపోని ప్రాణవాయువు ఇప్పుడు.. పది, 20శాతానికి పడిపోయాయి. ఇదే రేంజ్‌లో కేసులు పెరుగుతూ పోతే చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు వదిలే వారు పెరిగే అవకాశాలున్నాయి.
ఇక, ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లో ఎలాంటి పరిస్థితులు మనం చూశామో.. అమెరికా కూడా అదే స్థాయిలో చవిచూసే ప్రమాదం పొంచిఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా సర్కారు.. భారీ ఎత్తున ఆక్సిజన్ నిలవలను పెంచుకుంటోంది. పెద్ద పెద్ద పరిశ్రమలకు వెళ్లే ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. ఒకపక్క డెల్టా కేసులు పెరుగుతుండటంతో.. దక్షిణ అమెరికాకు చెందిన పలు రాష్ట్రాలు రిజర్వ్ ఆక్సిజన్‌ను వినియోగించే పరిస్థితి చేరుకోవడం కలవరపెడుతోంది. డిసెంబరు నాటికి కొత్తగా లక్ష మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు అమెరికా టాప్ సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీ. కేవలం ఏడాది సమయంలో కరోనా మరణాలు 14 రాష్ట్రాల్లో 50శాతం పెరిగాయని ఓ అధ్యయనం బయటికొచ్చింది. 28 రాష్ట్రాల్లో పదిశాతం పెరిగాయి. అయితే, దేశంలో టీకా ఇచ్చే వేగం ఇంకా పెంచితే తప్ప.. మరణాల సంఖ్యను తగ్గించలేమంటున్నారు నిపుణులు. దీంతో బైడెన్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు తయారుచేస్తోంది.
Read Also…. September 1: కస్టమర్లు అలర్ట్: నేటి నుంచి ఈ నిబంధనలు మారుతున్నాయ్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలివే..
Maharashtra: భారీ వర్షాలకు ఇద్దరు మృతి.. వరదల కారణంగా అనేక మంది అదృశ్యం