Maharashtra: భారీ వర్షాలకు ఇద్దరు మృతి.. వరదల కారణంగా అనేక మంది అదృశ్యం
మహారాష్ట్రలో ఒక పక్క కరోనా విజృంభణ మళ్లీ మొదలవుతుంటే, మరోపక్క భారీ వర్షాలు, వరదలు మరాఠాను ముంచెత్తాయి. వాయువ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు
Maharashtra – Heavy rainfall: మహారాష్ట్రలో ఒక పక్క కరోనా విజృంభణ మళ్లీ మొదలవుతుంటే, మరోపక్క భారీ వర్షాలు, వరదలు మరాఠాను ముంచెత్తాయి. వాయువ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలతో ఇద్దరు మరణించారు. భారీ వరదల కారణంగా అనేక మంది అదృశ్యమయ్యారు. జల్‌గావ్‌తో పాటు ఔరంగాబాద్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక, వాణిజ్య రాజధాని ముంబైలో నిన్న 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిన సంగతి తెలిసిందే.
కాగా, మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్నారు జనం . జలగావ్, ఔరంగాబాద్ జిల్లాల్లో అపారనష్టం జరిగింది. ఘోత్రాం ఘాట్ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. చాలిస్‌గామ్, ఔరంగాబాద్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జలగావ్ లోని చాలిస్‌గావ్-కన్నడఘాట్ దగ్గర కొండచరియలు విరిగిపడడంతో ఒకరు చనిపోయారు. వందలాది వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఔరంగాబాద్-చాలిస్‌గావ్-దూలే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బురదవరదలో లారీలు కొట్టుకుపోయాయి. వందలాది మూగజీవులు వరదల కారణంగా చనిపోయాయి. ముంబైలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. అక్కడ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
జల్‌గావ్ సమీపం లోని కన్నఢఘాట్‌లో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ల మధ్య వందలాది వాహనాలు చిక్కుకుపోయాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ముంబైతో పాటు శివార్లలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. హైవేపై కొండచరియలను తొలగించడానికి కనీసం 24 గంటల సమయం పడుతుందని అధికారులంటన్నారు. అయితే అక్కడ చిక్కుకున్న లారీడ్రైవర్లు మాత్రం నరకయాతన అనుభవిస్తున్నారు.
Read also: Pawan Kalyan – MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్