మ‌రో టాలీవుడ్‌ హీరోయిన్‌కి క‌రోనా పాజిటివ్‌

హీరోయిన్ నిక్కీ గార్లానికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా కొద్ది గంట‌ల ముందు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆమె కోవిడ్‌కి చికిత్స తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది. నా కోసం చికిత్స అందించిన వైద్యులకు థ్యాంక్స్ అని..

మ‌రో టాలీవుడ్‌ హీరోయిన్‌కి క‌రోనా పాజిటివ్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 8:41 PM

దేశ వ్యాప్తంగా క‌రోనా వైరస్ ఎంత‌లా వ్యాప్తి చెందుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే రెండున్న‌ర ల‌క్ష‌లు దాటేశాయి కోవిడ్ కేసులు. అలాగే ఇప్ప‌టికే ఎంతో మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ వైర‌స్ బారిన పడుతూనే ఉంటున్నారు. సామాన్యుల‌తో పాటు వీరికి కూడా కోవిడ్ సోక‌డం ప్ర‌జ‌లను ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. ఇప్పుడు తాజాగా మ‌రో తెలుగు, త‌మిళ హీరోయిన్‌కి కరోనా సోకింది.

హీరోయిన్ నిక్కీ గార్లానికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా కొద్ది గంట‌ల ముందు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆమె కోవిడ్‌కి చికిత్స తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది. నా కోసం చికిత్స అందించిన వైద్యులకు థ్యాంక్స్ అని ట్వీట్‌లో పేర్కొంది నిక్కీ. కాగా నిక్కీ గార్లానీ న‌టుడు సునీల్ న‌టించిన కృష్ణాష్ట‌మి సినిమాలో న‌టించింది. ఆ త‌రువాత త‌మిళ్‌లో కూడా సినిమాలు చేస్తుంది. ఇక ప్ర‌స్తుతం లారెన్స్ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం త‌మిళ్ రీమేక్‌లో స‌మంత పాత్ర‌లో నిక్కీ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

Read More:

ఇక‌పై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్‌! ఎలాగంటే?

కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ