నిఖిల్ తరహాలోనే.. సైలెంట్‌గా పెళ్లికి ప్లాన్ చేస్తోన్న హీరో నితిన్

ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లికి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే నిఖిల్ ఎలాంటి హడావిడి లేకుండా.. లాక్‌డౌన్‌లో పెళ్లి చేసేసుకున్నాడు. అలాగే రానా ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. ఇప్పుడు నితిన్‌ కూడా వాయిదా వేసుకున్న పెళ్లి పనులను..

  • Tv9 Telugu
  • Publish Date - 12:55 pm, Fri, 22 May 20
నిఖిల్ తరహాలోనే.. సైలెంట్‌గా పెళ్లికి ప్లాన్ చేస్తోన్న హీరో నితిన్

ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లికి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే నిఖిల్ ఎలాంటి హడావిడి లేకుండా.. లాక్‌డౌన్‌లో పెళ్లి చేసేసుకున్నాడు. అలాగే రానా ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. ఇప్పుడు నితిన్‌ కూడా వాయిదా వేసుకున్న పెళ్లి పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది సమ్మర్‌లోనే పెళ్లి చేసుకోవాలని నిఖిల్ చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడు. కరోనా వచ్చినా పెళ్లి పనులను ఆపలేనని గుడిలో దండలు మార్చుకోనైనా పెళ్లి చేసుకుంటానని గతంలోనే చెప్పాడు. అయితే మొత్తానికి అనుకున్నట్టుగానే.. కుటుంబ సభ్యుల సమక్షంలో.. సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అలానే ఎవరూ ఊహించని విధంగా.. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం లాక్‌డౌన్‌లో రెండో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు.

ఇక ఇప్పుడు నితిన్ అదే తరహాలో వివాహానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు ఓ టాక్ నడుస్తోంది. అసలు నిజానికి నితిన్.. ఏప్రిల్ 16న దుబాయ్‌లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ లాక్‌డౌన్ కారణంగా దాన్ని వాయిదా వేసుకున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగేటట్టుగానే కనిపిస్తోంది. దీంతో నితిన్ కూడా సైలెంట్‌గా పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యాడట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. నితిన్ అనౌన్స్‌మెంట్ వరకూ ఆగాల్సిందే.

Read More:

బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ

బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల తగ్గింపు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం