AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Job Notification 2025: యూపీఎస్సీలో గ్రూప్‌ A & B ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. కొన్నింటికి రాత పరీక్షలేకుండానే ఎంపిక

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ రంగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం..

UPSC Job Notification 2025: యూపీఎస్సీలో గ్రూప్‌ A & B ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. కొన్నింటికి రాత పరీక్షలేకుండానే ఎంపిక
UPSC Jobs
Srilakshmi C
|

Updated on: Jul 08, 2025 | 6:23 AM

Share

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ రంగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన భ్యర్థులు జులై 17, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు..

  • రీజినల్ డైరెక్టర్ పోస్టులు: 01
  • సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 02
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 08
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 09
  • మేనేజర్ గ్రేడ్-I/సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 19
  • సీనియర్ డిజైన్ ఆఫీసర్ పోస్టులు: 07
  • సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 20
  • సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 01
  • సైంటిస్ట్-బీ పోస్టులు: 05
  • లీగల్ ఆఫీసర్ పోస్టులు: 05
  • డెంటల్ సర్జన్ పోస్టులు: 04
  • డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 02
  • స్పెషలిస్ట్ పోస్టులు: 72
  • ట్యూటర్ పోస్టులు: 19
  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు: 02
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 08
  • మైన్స్ సేఫ్టీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 03
  • డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు: 02
  • అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సెల్ పోస్టులు: 14
  • డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సెల్ పోస్టులు: 09
  • అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్ & అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 01
  • నాటికల్ సర్వేయర్-కమ్-డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు: 01
  • అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ పోస్టులు: 04
  • స్పెషలిస్ట్ గ్రేడ్-II (జూనియర్ స్కేల్) పోస్టులు: 11
  • ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు: 01
  • అసిస్టెంట్ జిల్లా న్యాయవాది పోస్టులు: 09

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జులై 17, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, అనుభవం ఆధరంగా నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసే అవకాశం ఉంది.

నోటిపికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు