UGC NET 2021 May Exam: కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. యూజీసీ నెట్ పరీక్ష వాయిదా..
UGC NET 2021 May Exam Postponed: కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశమంతటా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బోర్డు పరీక్షలను,
UGC NET 2021 May Exam Postponed: కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశమంతటా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బోర్డు పరీక్షలను, పలు ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేసింది. కొన్నింటిని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే లో జరిగే యూజీసీ నెట్ 2021 పరీక్షను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అభ్యర్థులు, పరీక్షా సిబ్బంది భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సూచించినట్లు వెల్లడించారు. తాజాగా ప్రకటించిన సర్క్యూలర్ ప్రకారం పరీక్షను నిర్వహించే 15 రోజుల ముందు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటిస్తుంది.
విద్యాశాఖ మంత్రి చేసిన ట్విట్..
?Announcement Keeping in mind the safety & well-being of candidates and exam functionaries during #covid19outbreak, I have advised @DG_NTA to postpone the UGC-NET Dec 2020 cycle (May 2021) exams.#Unite2FightCorona pic.twitter.com/5dLB9uWgkO
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 20, 2021
వాస్తవానికి ఎన్‌టీఏ సర్యూలర్ ప్రకారం.. నెట్ పరీక్షను మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా కొన్ని రోజుల్లో అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ క్రమంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు కరోనా నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి అభ్యర్థులు కూడా నెట్ పరీక్షలను వాయిదా వేయాలని సూచిస్తున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పీహెచ్‌డీ చేయడానికి అర్హత కోసం 81 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తుంది. సాధారణంగా జూన్, డిసెంబర్‌లో పరీక్ష జరుగుతుంది. కానీ.. కోవిడ్ వల్ల గతేడాది జూన్‌లో నిర్వహించే పరీక్షను రద్దు చేశారు. అనంతరం ఈ పరీక్షను 2021సెప్టెంబరులో నిర్వహించారు. ఆ తర్వత పరీక్షను నిర్వహించలేదు. ఈ క్రమంలో తాజాగా జరగాల్సిన పరీక్ష కూడా వాయిదా పడింది.
Also Read: Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం..