TV9 Education Summit 2025: టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు టీవీ9 కన్నడ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025.. ఎక్కడంటే?
TV9 Education Fair: పిల్లల ఉన్నత విద్య గురించి ఆలోచించే తల్లిదండ్రులకు TV9 సకొత్త ద్వారాన్ని తెరచింది. టీవీ9 కన్నడ విద్యా సమ్మిట్ 2025 మూడు రోజుల కార్యక్రమం బెంగళూరులోని త్రిపురవాసిని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తుంది. విద్యార్థులు తమ కెరీర్‌లను ఎంచుకోవడానికి, తమ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి సమగ్ర వేదిక ఇది..

బెంగళూరు, ఏప్రిల్ 5: విద్యార్ధుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు టీవీ9 కన్నడ విద్యా సమ్మిట్ 2025 కార్యక్రమం బెంగళూరు వేధికగా నిర్వహిస్తున్నారు. టీవీ9 కన్నడ నిర్వహించే ఈ కార్యక్రమం దేశ, విదేశాలలో ఉన్నత విద్య కోసం గైడెన్స్ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలో.. ఏ కోర్సు తీసుకోవాలో తెలియక విద్యార్ధుల అయోమయానికి గురవుతుంటారు. ఇలాంటి వారికి టీవీ9 కన్నడ విద్యా సమ్మిట్ 2025 చక్కని అవగాహన కలిగించి విద్యార్థులకు వారి భవిష్యత్ కెరీర్ మార్గాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది.
ఏప్రిల్ 4 నుంచి బెంగళూరులోని త్రిపురవాసిని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో టీవీ9 కన్నడ విద్యా సమ్మిట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6 వరకు ఇవి జరుగుతాయి. ఈ కార్యక్రమం విద్యార్థులు భవిష్యత్తుకు తమ కెరీర్‌ను ఎంచుకోవడంతో ఎంతో సహాయపడుతుంది. అనేక ప్రతిష్టాత్మక కళాశాలల సహకారంతో ఈ సమ్మిట్ జరుగుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక కళాశాలలు ఇందులో పాల్గొంటున్నాయి. విద్యతో సహా కొత్త కెరీర్ అవకాశాల గురించి నిపుణుల నుంచి అభిప్రాయాలను పొందవచ్చు. వివిధ కోర్సు ఎంపికల గురించి సమాచారం పొందడానికి ఇది గొప్ప వేదిక. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మా, ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ఫైర్ సేఫ్టీ, హోటల్ మేనేజ్‌మెంట్, యానిమేషన్, కామర్స్, ఫైనాన్స్, ఫైర్ సేఫ్టీ, మేనేజ్‌మెంట్ మొదలైన విభాగాలలో అందుబాటులో ఉన్న కోర్సుల గురించి సమాచారాన్ని ఈ సమ్మిట్‌లో పొందవచ్చు.
TV9 Education Summit 2025: ಇಂಜಿನಿಯರಿಂಗ್ಗೆ ಯಾವ ಕಾಲೇಜು? ಯಾವ ಕೋರ್ಸ್ ಬೆಸ್ಟ್ ಗೊತ್ತಾ? | #TV9D
Video Link► https://t.co/mqr3josNmt #TV9Kannada #tv9expo #TV9EducationSummit2025 #tv9educationfair #tv9educationexpobengaluru #School #College #Banglorecolleges
— TV9 Kannada (@tv9kannada) April 5, 2025
అంతేకాకుండా కోర్సుల వివరాలు, ప్రవేశ ప్రక్రియలు, అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోవడానికి ప్రముఖ కళాశాలలు, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థల నిపుణులతో విద్యార్దులు నేరుగా ముఖాముఖి కలిసే అవకాశం కూడా ఉంటుంది. కెరీర్ ఎంపికలు, అందుకు అవసరమైన సంబంధిత విద్యా అర్హతల గురించి తెలుసుకోవచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నిపుణుల మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. ప్రవేశం పూర్తిగా ఉచితం. విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కెరీర్‌కు బాటలు వేసుకోవాలని టీవీ9 మీడియా సంస్థ ఆకాంక్షిస్తోంది.
TV9 Education Summit 2025: ಎರಡನೇ ದಿನ TV9 ಎಜುಕೇಷನ್ ಎಕ್ಸ್ಪೋಗೆ ಭರ್ಜರಿ ರೆಸ್ಪಾನ್ಸ್ | #TV9D
Video Link► https://t.co/RjsjlkLtYr #TV9Kannada #tv9expo #TV9EducationSummit2025 #tv9educationfair #tv9educationexpobengaluru #School #College #Banglorecolleges
— TV9 Kannada (@tv9kannada) April 5, 2025
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.