TV9 – KAB Education Summit: మీ పిల్లల భవిష్యత్తుపై సందేహాలా..? తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎడ్యుకేషన్ సమ్మిట్.. ఎంట్రీ ఫ్రీ..
Tv9-KAB Education summit: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ త్వరలోనే జరగనుంది. ఇంటర్మీడియట్ (+2) విద్యార్థుల కోసం TV9 - KAB Education Consultancy సంయుక్తంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో అతిపెద్ద ఎడ్యూకేషన్ సమ్మిట్ నిర్వహించనున్నాయి.
Tv9-KAB Education summit 2023: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ త్వరలోనే జరగనుంది. ఇంటర్మీడియట్ (+2) విద్యార్థుల కోసం TV9 – KAB Education Consultancy సంయుక్తంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో అతిపెద్ద ఎడ్యూకేషన్ సమ్మిట్ నిర్వహించనున్నాయి. ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ విజయవాడలో మే 27, 28 తేదీలలో, జూన్ 4న విశాఖపట్నంలో, జూన్ 9, 10, 11వ తేదీలలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నారు. ఎన్నో ప్రఖ్యాత కాలేజీలు యూనివర్సిటీలు పాల్గొనే ఈ Education Summitలో, విద్యార్థులు +2 తరువాత తదుపరి విద్యావకాశాలు, పలు రకాల కోర్సులు, వాటికి సంబందించిన కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చు.
ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ ఇలా ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని రకాల గైడెన్స్ ఇస్తూ ఎన్నో ప్రఖ్యాత విద్యా సంస్థల గురించి తెలియజేసే ఈ Education Summit విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందివ్వనుంది. దీంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు EAPCET, NEET, JOSAA, E-CET వెబ్ కౌన్సెలింగ్ లలో ఆప్షన్లను నమోదు చేసుకోవడానికి ఎక్స్‌పర్ట్స్ సలహాలు, సూచనలు కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో TV9 & KAB Education Summit 2023 వివరాలు..
- Vijayawada: May 27th &28th, SS కన్వెన్షన్ సెంటర్, PVP మాల్ లేన్ ఎదురుగా, MG రోడ్, విజయవాడ.
- Visakhapatnam: June 4th, నోవాటెల్, బీచ్ రోడ్, మహారాణి పేట, విశాఖపట్నం.
- Hyderabad:June 9th, 10th& 11th, నిజాం కాలేజి గ్రౌండ్స్, హైదరాబాద్
ఈ సదస్సులో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు పాల్గొని సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. విద్యారంగ పరిస్థితులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి కోర్సులు చేయాలి..? ఏ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది..? టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి.. ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? ఏ ర్యాంక్‌కు ఎక్కడ సీటు వస్తుంది?.. ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది..? ఇలా సందేహం ఏదైనా ఎక్స్‌పర్ట్స్ సమాధానం ఇస్తారు. కాగా.. ఈ సమ్మిట్‌కు ప్రవేశం ఉచితం. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ గా ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..