TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం.
తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్‌లో భాగంగా ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 23వ తేదీని...
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను పర్మినెంట్ విధానంలో తీసుకోవడం విశేషం. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? ఎలాంటి అర్హతలు ఉండాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్‌లో భాగంగా ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 23వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఏంటి.? ఎలా ఎంపిక చేస్తారంటే..
పైన పేర్కొన్ని ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు. ఇక విద్యార్హత విషయానికొస్తే.. బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు చెల్లిస్తారు. ఏఈ పోస్టులకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు జీతంగా చెల్లిస్తారు. ఏటీవో పోస్టులకు నెలకు రూ. 37,640 నుంచి రూ. 1,15,500 వరకు జీతంగా అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 23వ తేదీతో ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..