TS PECET 2022 నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PECET 2022) నోటిఫికేషన్ ఉన్నత విద్యామండలి శుక్రవారం (ఏప్రిల్ 8) విడుదల చేసింది..
TS PECET 2022 Exam Date: తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PECET 2022) నోటిఫికేషన్ ఉన్నత విద్యామండలి శుక్రవారం (ఏప్రిల్ 8) విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులయిన బీపీఎడ్, డీపీఎడ్ ప్రవేశాలకు గానూ తాజా నోటిఫికేషన్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. TS PECET 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి (ఏప్రిల్ 11) నుంచి ప్రారంభమౌతుంది. జనరల్ అభ్యర్ధులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే రూ.400లు చెల్లించవల్సి ఉంటుంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500ల ఆలస్య రుసుముతో జులై 13 వరకు, రూ.2,000ల ఆలస్య రుసుముతో జులై 20 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఆగస్టు 8 నుంచి 13 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని ప్లే గ్రౌండ్‌లో ఫిజికల్ పరీక్షలు ఆగస్టు 22 నుంచి నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో https://pecet.tsche.ac.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: