TS Inter Result Date 2023: ఇంటర్ ఫలితాల వెల్లడిపై బోర్డు కీలక ఆదేశాలు.. మరో రెండు మూడు రోజుల్లోనే..
తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ బుధవారం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఆదేశించారు. దీనికోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక కసరత్తు..
తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ బుధవారం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఆదేశించారు. దీనికోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్పాట్ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియ, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు విధానాలపై చర్చించారు. ప్రతీ సంవత్సరం పరీక్షలు, ఫలితాల వెల్లడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఈసారి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అన్నారు. ఫలితాల వెల్లడికి అవసరమైతే కొంత సమయం తీసుకోవడానికైనా వెనుకాడవద్దన్నారు. అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలని అధికారులకు మిత్తల్ సూచించారు.
కాగా ఆన్‌లైన్ ఫీడింగ్‌లో గతంలో అనేక పొరపాట్లు చోటుచేసుకున్నాయి. మార్కుల నమోదులో గతంలో ఎందుకు సమస్యలొచ్చాయో సమీక్షించి ఇంటర్ ఫలితాల వెల్లడికి కార్యచరణ రూపొందించాలన్నారు. ఇక ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. అంతిమంగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమవ్వాలనే యోచనలో బోర్డు ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ముందుగా ప్రకటించిన విధంగానే మే రెండో వారం నాటికే ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.