TS Intermediate: విద్యార్ధుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ.. జూనియర్‌ కాలేజీలకు గట్టి వార్నింగ్‌

గత ఫిబ్రవరిలో నార్సింగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యల నిరోధానికి ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సమర్పించిన నివేదిక సమీక్ష అనంతరం ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ మార్గదర్శకాలను జారీచేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మొత్తం 16 రకాల మార్గదర్శకాలను..

TS Intermediate: విద్యార్ధుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ.. జూనియర్‌ కాలేజీలకు గట్టి వార్నింగ్‌
TS Inter Board guidelines
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2023 | 1:21 PM

గత ఫిబ్రవరిలో నార్సింగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యల నిరోధానికి ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సమర్పించిన నివేదిక సమీక్ష అనంతరం ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ మార్గదర్శకాలను జారీచేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మొత్తం 16 రకాల మార్గదర్శకాలను జారీ చేశారు. అవేంటంటే..

ఇంటర్‌ బోర్డు నూతన మార్గదర్శకాలు..

  • ఇంటర్‌ తరగతులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి.
  • ఉదయం అల్పాహారం తీసుకోవడానికి, ఇతర కాలకృత్యాల కోసం గంటన్నర సమయం ఇవ్వాలి.
  • మధ్యాహ్నం, రాత్రి భోజనం 45 నిమిషాలు భోజన విరామం ఇవ్వాలి.
  • కనీసం 8 గంటల పాటు నిద్రపోయే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి.
  • ఏటా ప్రతి విద్యార్థికి యాజమాన్యాలు రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించాలి.
  • అదనంగా తరగతులు నిర్వహించాలనుకుంటే రోజుకు 3 గంటలకు మించరాదు.
  • రోజూ సాయంత్రం విద్యార్థులు వినోదాన్ని, ఉల్లాసాన్ని పొందేందుకు గంట సమయం కేటాయించాలి
  • తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలి. వారికి ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా ఉండాలి.
  • ఒకసారి సిబ్బందిని నియమించుకుంటే విద్యాసంవత్సరం ముగిసే (ఏప్రిల్‌) వరకు వారిని తొలగించరాదు.
  • ప్రతి జూనియర్‌ కళాశాలకు శాశ్వతంగా ప్రత్యేక మొబైల్‌ నంబరు ఉండాలి.
  • ప్రతి కళాశాలలో సీనియర్‌ అధ్యాపకుడిని స్టూడెంట్‌ కౌన్సిలర్‌గా నియమించాలి.
  • ఇంటర్‌బోర్డు అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రతి జూనియర్‌ కళాశాల తప్పనిసరిగా పాటించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్‌ నిరోధానికి కమిటీని నియమించాలి.
  • కళాశాలలో చేరిన తర్వాత విద్యార్థి ఒకవేళ 3 నెలల్లోపు మానుకుంటే 75%, ఆ తర్వాత 3 నెలల్లోపు 50%, 6 నెలల అనంతరం అయితే 25% ఫీజు తిరిగి చెల్లించాలి.

మార్గదర్శాల్లో.. ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలేవి?

ఇకనుంచి ఏదైనా కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత ఒక ఏడాది ఆ కళాశాలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేదిలేదని గత మార్చి 6న సమావేశానికి హాజరైన కళాశాలల ప్రతినిధులను అధికారులు హెచ్చరించారు. తాజా ఉత్తర్వుల్లో మాత్రం ఆ ప్రస్తావన లేదు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా జూనియర్‌ కాలేజీలు ఇస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేదానిపై మార్గదర్శకాల్లో ప్రస్తావించలేదు. అలాగే విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్‌ బోర్డు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకపోతే ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా ప్రస్తావించలేదు. తాజా మార్గదర్శకాల్లో కొత్తది ఏమీ లేదన్నారు. వీటివల్ల ఆత్మహత్యల నివారణ ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ పి మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!