SSC Exam Dates 2023: ఎస్‌ఎస్‌సీ రాత పరీక్ష తేదీలు విడుదల.. ఆగస్టు 2 నుంచి సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/శాఖల్లో భర్తీ చేయనున్న వివిధ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను తాజాగా కమిషన్‌ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల..

SSC Exam Dates 2023: ఎస్‌ఎస్‌సీ రాత పరీక్ష తేదీలు విడుదల.. ఆగస్టు 2 నుంచి సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలు
Staff Selection Commission
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2023 | 12:26 PM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/శాఖల్లో భర్తీ చేయనున్న వివిధ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను తాజాగా కమిషన్‌ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 22 వరకు, ఎంటీఎస్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 1నుంచి 29 వరకు, ఎస్సై (ఢిల్లీ పోలీస్) పరీక్షలను అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాత పరీక్ష తేదీలు ఇవే..

  • కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్‌ ఎగ్జామ్‌-2023.. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు నిర్వహిస్తారు.
  • మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ అండ్‌ హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్‌) ఎగ్జామ్‌-2023.. సెప్టెంబర్ 1 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తారు.
  • ఎస్సై (ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్) ఎగ్జామ్‌-2023 .. అక్టోబర్‌ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.