
హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2024-25 పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న విద్యార్ధుల లక్షలాది విద్యార్ధుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. తాజా ప్రకటన మేరకు సోమవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు సోమవారం (జూన్ 16) ఇంటర్ అడ్బాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు చెందిన విద్యార్థులందరి ఫలితాలు విడుదలవుతాయి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in లేదా http://results.cgg.gov.inలలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
కాగా ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు మార్కులను పెంచుకోవడానికి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా విద్యార్ధులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. మే 22 నుంచి 29 వరకు జరిగిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇటీవల జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఇంటర్ మార్కులు కీలకంగా మారడంతో ఫలితాలపై విద్యార్థులు తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.