TS Inter Supply Exam Schedule 2024: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు హెడ్యూల్‌ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌..

TS Inter Supply Exam Schedule 2024: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు
TS Inter Supply Schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 24, 2024 | 1:26 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు హెడ్యూల్‌ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు ఏప్రిల్ 25 నుంచి అంటే రేపట్నుంచి ఫీజు చెల్లించాలి. మే 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ 2024 ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

రేపట్నుంచే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు కూడా ఫీజు చెల్లింపులు

ఇంటర్‌ సమాధాన పత్రాల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు కూడా రేపట్నుంచే ఫీజు చెల్లింపులు చేయవచ్చు. ఫీజులను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, కాపీ కమ్‌ రీ వెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.600 ఫీజుగా చెల్లించాలి. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 25 నుంచి మే 5వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి ఇంటర్‌ బోర్డు అనుమతించింది.

కాగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ రెండు సంవత్సరాలకు కలిపి అమ్మాయిలు పైచేయి సాధించారు. ఈ సంవత్సరం రెండు యేళ్లకు కలిపి మొత్తం 69.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఈ ఏడాది మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో మొత్తం 8,31,858 మంది విద్యార్ధులు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ