TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( టీఎస్ ఈసెట్) 2022 పరీక్ష ఫలితాలు ఈ రోజు (ఆగస్టు 12)న విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా..
TS ECET Result 2022 link: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( టీఎస్ ఈసెట్) 2022 పరీక్ష ఫలితాలు ఈ రోజు (ఆగస్టు 12)న విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా శుక్రవారం ఫలితాలు ప్రకటించారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. TSbestEoDB పాస్‌వర్డ్‌తో ఆన్‌లైన్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈసెట్ పరీక్షకు దాదాపు 24,000ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22,000ల మంది జులై 1న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. ఆ రోజు విడుదలైన ఫలితాల్లో 19,954 మంది అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 90.69 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అబ్బాయిలు 90.55 శాతం, అమ్మాయిలు 91.03 శాతం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000ల సీట్లకు త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. జేఎన్టీయూహెచ్‌లో ఈ రోజు తెలంగాణ ఎంసెట్ ఫలితాలతోపాటు ఈ సెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.