TS Eamcet 2022 results: తెలంగాణ ఎంసెట్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAMCET 2022) ఫలితాలు శుక్రవారం (ఆగస్టు12) విడుదలయ్యాయి..

TS Eamcet 2022 results: తెలంగాణ ఎంసెట్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
Ts Eamcet 2022 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 12, 2022 | 11:44 AM

TS Eamcet 2022 Result link: తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAMCET 2022) ఫలితాలు శుక్రవారం (ఆగస్టు12) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటల 15 నిముషాలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూహెచ్‌లో ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేశారు. టీఎస్‌ ఎంసెట్‌ 2022 ఫలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్‌ ‘కీ’ కూడా విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌లో రిజల్ట్స్‌ చెక్ చేసుకోవచ్చు. పాస్‌వర్డ్‌ 2022@freedomతో ఆన్‌లైన్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎంసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. టాప్‌ ర్యాంక్‌లన్నీ అమ్మాయిలనే వరించాయి. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో లక్ష్మిసాయి లోహిత్‌ రెడ్డి (హైదరాబాద్‌) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా, సాయి దీపిక సెకండ్‌ ర్యాంక్‌ (శ్రీకాకుళం), కార్తికేయ (గుంటూరు జిల్లా) మూడో ర్యాంక్‌ సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో నేహ (గుంటూరు) ఫస్ట్‌ ర్యాంక్ సాధించారు. రోహిత్‌ (విశాఖపట్నం) సెకండ్‌ ర్యాంక్‌ , తరుణ్‌ కుమార్‌ (గుంటూరు) మూడో ర్యాంక్ సాధించారు. ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ 80.41, అగ్రికల్చర్‌ 88.34 మంది అర్హత సాధించినట్లు విద్యాధికారులు తెలిపారు.

TS Eamcet 2022 Result ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే ‘EAMCET 2022 score card’ లింక్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • ఆ తర్వాత లాగిన్‌ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌ చెయ్యాలి.
  • వెంటనే స్క్రీన్‌ పై ఫలితాలు కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం హార్డు కాపీని సేవ్‌ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధిన విద్యార్దులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో కౌన్సెలింగ్‌ డేట్లు విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది కౌన్సెలింగ్‌ టైంలో విద్యార్ధుల సౌకర్యార్ధం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కూడా కేటాయిస్తామన్నారు. ఈ ఏడాది జులై 18 నుంచి 21 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు, జులై 30, 31 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. టీఎస్‌ ఎంసెట్‌ 2022 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు లక్షా 70 వేల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో1,56,812 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా కోర్సులకు నిర్వహించిన పరీక్షకు 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!