AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon Cultivation: ఒక్క ప్రయోగంతో మూడింతల దిగుబడి.. పుచ్చకాయ రైతు వినూత్న ఆలోచన

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు సీజనల్ పుచ్చకాయలతో పాటు సీతాఫలాలను పండించడంలో తన ఆధునిక విధానంతో వార్తల్లో నిలిచాడు. తిర్వా నివాసి అయిన అమితాబ్ భదౌరియా భారీ లాభాలను అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు విదేశాలకు ఈ పండ్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. భదౌరియా సాగు కోసం తైవాన్ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకుని ప్రత్యేకమైన పుచ్చకాయ, సీతాఫలాలను పండించాడు.

Watermelon Cultivation: ఒక్క ప్రయోగంతో మూడింతల దిగుబడి.. పుచ్చకాయ రైతు వినూత్న ఆలోచన
Watermelon
Nikhil
|

Updated on: May 29, 2024 | 4:45 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు సీజనల్ పుచ్చకాయలతో పాటు సీతాఫలాలను పండించడంలో తన ఆధునిక విధానంతో వార్తల్లో నిలిచాడు. తిర్వా నివాసి అయిన అమితాబ్ భదౌరియా భారీ లాభాలను అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు విదేశాలకు ఈ పండ్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. భదౌరియా సాగు కోసం తైవాన్ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకుని ప్రత్యేకమైన పుచ్చకాయ, సీతాఫలాలను పండించాడు. భారతదేశంలో అరుదైన పండ్లను పండించాలనే అతని ఆలోచన ఫలించింది. మూడు ఎకరాల భూమిలో అతని ఉత్పత్తి నుండి రూ.4 లక్షల లాభం పొందాడు. భదౌరియా సాగు విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి ఓ సారి తెలుసుకుందాం.

తైవాన్ పుచ్చకాయల ఉత్పత్తి ద్వారా తన లాభం ఖర్చు కంటే 10-12 రెట్లు ఎక్కువ అని బదౌరియా చెబుతున్నాడు. గోధుమలు, బియ్యం కంటే పుచ్చకాయలు లాభదాయకంగా ఉండడంతో ఈ ఏడాది ఒక స్థాయికి చేరుకున్నట్లు రైతు తెలిపారు. అయినప్పటికీ ఈ నిర్దిష్ట పండు కోసం వ్యవసాయం చేయడానికి వేరే పద్ధతి, అదనపు శ్రద్ధ అవసరమని చెబుతున్నారు. ఫంగస్ ఉన్నా, లేకపోయినా, పంటకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా పురుగుమందులు వేయాలని సూచిస్తున్నారు. 

బదౌరియా పండ్లను త్వరలో విదేశీ మార్కెట్‌లకు తీసుకెళ్లాలనే తన ప్రణాళికలను రచిస్తున్నాడు. ఈ రకం పుచ్చకాయను మార్చిలో పండించాలని, ఇది చల్లని వాతావరణం నుంచి కూడా రక్షణ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం భూమిలో పండ్ల సాగుకు అయ్యే ఖర్చు సుమారు రూ.20,000గా ఉంది. పండ్లను పండించడానికి పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని బట్టి లాభం చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఈ తైవాన్ పుచ్చకాయ బరువు 3 నుండి 3.50 కిలోల వరకు ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.