AP EAPCET 2024 Result Date: జూన్ మొదటి వారంలో ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే
ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలచేసేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జూన్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు సమాచారం. ఈఏపీసెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా ఒకే సారి ప్రకటించనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం పరీక్ష రాసిన విద్యార్ధులు ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్..
అమరావతి, మే 29: ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలచేసేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జూన్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు సమాచారం. ఈఏపీసెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా ఒకే సారి ప్రకటించనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం పరీక్ష రాసిన విద్యార్ధులు ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు ఏపీ ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని విభాగాలకు కలిపి మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 3,39,139 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం 93.47 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారన్నమాట. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 2,74,213 మందికి గాను 2,58,373 (94.22%) మంది హాజరవగా.. బైపీసీ స్ట్రీమ్‌కు 88,638 మంది దరఖాస్తు చేయగా.. వారీలో 80,766 (91.12%) మంది పరీక్ష రాశారు. ఇక ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఫలితాల ప్రటకన అనంతరం ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
జూన్ 3 నుంచి తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆయా తేదీలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇతర పూర్తి వివరాలకు 89199 74862 సంప్రదించాలని అధికారులు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.